- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాబోయ్ ఈవిడేం ఎమ్మార్వో.... కట్టలు తెంచుకున్న ఆగ్రహం
అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం ఎమ్మార్వో ఖాజాబీ తీరు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది....

దిశ, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లా(Annamaiah) వీరబల్లి మండలం ఎమ్మార్వో ఖాజాబీ(MRO Khazabi) తీరు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఎమ్మార్వో కార్యాలయం సిబ్బందిని ఆమె చులకనగా చూస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఉద్యోగులకు టార్గెట్ చేసి గొడ్డు చాకిరి చేయిస్తున్నారని, సమస్యల పరిష్కారం కోసం కార్యాలయానికి వచ్చే సామాన్య ప్రజల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు ఎమ్మార్వో దారుణాలపై అరుణ అనే అటెండర్ ఆందోళన వ్యక్తం చేశారు. 2 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మార్వో దారుణాలు భరించలేదకపోతున్నామని, జీతాలు బిల్లలపైనా సంతకం చేయడంలేదని వాపోయారు. తాను డిప్యుటేషన్‌పై వచ్చినప్పటి నుంచి ఎమ్మార్వో ఖాజాబీ వేధింపులకు పాల్పడుతోందని వ్యాఖ్యానించారు. ఎమ్మార్వో ఖాజాబీపై చర్యలు తీసుకోవాలని అరుణ డిమాండ్ చేశారు. గతంలో ఎక్కడ పని చేసినా ఉద్యోగులపై ఎమ్మార్వో దౌర్జన్యాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.






