- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కంపుకొడుతున్న అరకులోయ.. సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోల వైరల్
ప్రకృతి ఒడిలో పరవశించే అందాల అరకులోయ ప్రస్తుతం దుర్గంధంతో దర్శనమిస్తోంది. తమకు రావాల్సిన పెండింగ్ జీతాలను తక్షణమే విడుదల చేయాలంటూ గత నాలుగు రోజులుగా పెదలబుడు పంచాయతీ పారిశుధ్య కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు...

దిశ, వెబ్ డెస్క్: ప్రకృతి ఒడిలో పరవశించే అందాల అరకులోయ(Arakuloya) ప్రస్తుతం దుర్గంధంతో దర్శనమిస్తోంది. తమకు రావాల్సిన పెండింగ్ జీతాలను తక్షణమే విడుదల చేయాలంటూ గత నాలుగు రోజులుగా పెదలబుడు పంచాయతీ పారిశుధ్య కార్మికులు(Sanitation workers) నిరసన వ్యక్తం చేస్తున్నారు. కార్మికులు విధులను బహిష్కరించడంతో అరకులోయలో పారిశుధ్య పనులు పూర్తిగా స్తంభించిపోయాయి. ప్రధాన కూడళ్లు, వీధులు ఎక్కడికక్కడ వ్యర్థాలతో నిండిపోయి అరకు అందాన్ని దెబ్బతీస్తున్నాయి.
పేరుకుపోయిన చెత్త
రోడ్లపై పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు అధికారులు ఎటువంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంతో స్థానికులు, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవి విడిది కోసం ఉత్సాహంగా వచ్చిన పర్యాటకులు, అక్కడ వెదజల్లుతున్న దుర్వాసన భరించలేక ముక్కులు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పారిశుధ్య నిర్వహణపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ సందర్శకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నెటిజన్ల ఆవేదన
సోషల్ మీడియా వేదికగా అరకులోయ ప్రస్తుత దుస్థితిపై నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని వీడియోలు, ఫొటోలు తీసి "కంపుకొడుతున్న అరకు" అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, కార్మికుల సమస్యలను పరిష్కరించి అరకులోయను తిరిగి పూర్వస్థితికి తీసుకురావాలని పర్యాటకులు కోరుతున్నారు






