- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలవరం సందర్శనకు సీఎం.. పకడ్బందీగా ఏర్పాట్లు
పోలవరం సీఎం పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం అలర్ట్ అయింది..

దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 7న పోలవరం ప్రాజెక్టును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu) సందర్శించారు. దీంతో ఆ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న ప్రదేశాల్లో ప్రగతిపై సీఎం ఫొటో ప్రదర్శనకు ఏర్పాటు చేస్తోంది. ఇప్పటి వరకూ జరిగిన పనులపై సీఎం చంద్రబాబుకు జలవనరుల శాఖ వివరించాలని అధికారులు నిర్ణయించారు. పలుచోట్ల వైద్య శిబిరాలు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాదు మందు కూడా సిద్ధం చేసి పట్టేలా చర్యలు చేపట్టారు. సీఎం టూర్ మొత్తం పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడా ఎలాంటి అవచాంనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు చేపడుతున్నారు.
ఇప్పటికే జిల్లా ఎస్పీ ప్రతాప శివకిశోర్ ఆధ్వర్యంలో ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాలను పరిశీలించారు. సీఎం పర్యటన ముగిసే వరకు పటిష్టమైన భద్రత నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.






