- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యభిచారం చేయాలని మందులు, ఇంజక్షన్లు.. బాలికకు వంకర్లుపోయిన కాళ్లు, చేతులు
సొంత కొడలిని వ్యభిచారం కూపంలోకి లాగేందుకు అత్త ప్రయత్నం చేసింది...

దిశ, వెబ్ డెస్క్: సొంత కొడలిని వ్యభిచారం కూపంలోకి లాగేందుకు అత్త ప్రయత్నం చేసింది. అయితే అందుకు ఆమె అంగీకరించకపోవడంతో విశ్వరూపం చూపించింది. దీంతో ఏమి చేసినా వ్యభిచారం చేయనని తెగేసి చెప్పింది. ఎలాగైనా లొంగదీయాలనే ప్రయత్నంలో కోడలికి అత్త టాబ్లెట్లు, ఇంజక్షన్లు ఇచ్చింది. ఈ అమానవీయ ఘటన కాకినాడ జిల్లా పెద్దాపురంలో జరిగింది.
చందుతో బాలికకు పరిచయం
అనకాపల్లికి చెందిన బాలికకు, కాకినాడ జిల్లా పెద్దాపురానికి చందుకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారింది. కానీ బాలక తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో పారిపోయి చందు, బాలిక పెళ్లి చేసుకున్నారు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినా చందునే కావాలని బాలిక అత్తింటికి వెళ్లిపోయింది. బాలిక కాపురం కొద్ది రోజులు బాగానే సాగింది. ఆ తర్వాత అత్తా అసలు రూపం బయటపడింది. డబ్బులు కోసం అత్త బరిగించింది. కొడలు అనే విషయం మర్చిపోయి వ్యభిచారం చేయాలని డిమాండ్ చేసింది. ఇందుకు కోడలు ఒప్పుకోలేదు. కానీ ఒప్పించేందుకు అత్త ప్రయత్నం చేసింది. ఇందుకు బాలిక మాత్రం ససేమీరా అన్నారు. చంపినా సరే వ్యభిచార కూపంలోకి దిగనని తెగెసి చెప్పింది.
వ్యభిచారం చేయమని బలవంతంగా మందులు, ఇంజెక్షన్లు
దీంతో అత్త నీలిమ ఆగ్రహానికి గురైంది. బాలికకు వేధింపులు మొదలుపెట్టింది. బాలికకు బలవంతంగా రకరకాల మందులు, ఇంజెక్షన్లు ఇచ్చారు. క్రమంగా బాలిక శరీరంలో మార్పులు సంభవించాయి. చేతులు, కాళ్లు వంకర్లు తిరిగాయి. అంతేకాదు మాటలు రాని పరిస్థితి ఏర్పడింది. రోజులు గడిచే కొద్ది బాలిక పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.
ప్రమాదకరంగా బాధితురాలి పరిస్థితి
వెంటనే బాలికకు కాకినాడ జీజీహెచ్ ఆస్పత్రిలో చేర్పించారు. బాలిక పరిస్థితిలో ఎలాంటి మార్పులేకపోడంత మెరుగైన వైద్యం కోసం విమ్స్‌కు తరలించారు. కానీ బాలిక పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. అయితే అక్కడ నుంచి కూడా డిశ్చార్చి చేయించి విశాఖ మానసిక ఆస్పత్రిలో చేర్చించారు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే పోలీసులపై బాధతులు విమర్శలు చేస్తున్నారు. గతంలో తమ కూతురిని చందు పెళ్లి చేసుకున్న సమయంలో సరిగా స్పందించలేదని మండిపడ్డారు. అప్పుడే తమ పిల్లను అప్పగించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు.






