తొర్రేడులో దారుణం.. చాకుతో గొంతుకోసి తండ్రిని చంపిన కుమారుడు

by Vemula.Srinu Prasad |

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం తొర్రేడులో దారుణం జరిగింది...

తొర్రేడులో దారుణం.. చాకుతో గొంతుకోసి తండ్రిని చంపిన కుమారుడు
X

తొర్రేడులో దారుణం.. తండ్రిని చంపిన కుమారుడు

దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం తొర్రేడులో దారుణం జరిగింది. తండ్రిని కుమారుడు గొంతు కోసి చంపేశాడు. గ్రామానికి చెందిన అప్పారావుకు ఇద్దరు కుమారెలు, కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తెకు ఇటీవల పెళ్లి సంబంధం కుదిరింది. కట్నంగా రూ.2 లక్షలు ఇవ్వాలని అడిగారు. అయితే డబ్బులు లేకపోవడంతో తండ్రి అప్పారావు వెనక్కి తగ్గారు. ఈ విషయంలో తండ్రి, కుమారుడు సాయికుమార్ మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన కుమారుడు.. తండ్రి తలను గోడకు కొట్టారు. అనంతరం ఇంటి తలుపులు వేసి చాకుతో గొంతు కోశారు. దీంతో తండ్రి సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story