క్షణికావేశంలో ఎంత పని జరిగింది..?.. తండ్రీకుమారుడు ఇద్దరూ దుర్మరణం

by Vemula.Srinu Prasad |

కాకినాడ జిల్లా పాయకరావుపేటలో దారుణం జరిగింది...

క్షణికావేశంలో ఎంత పని జరిగింది..?.. తండ్రీకుమారుడు ఇద్దరూ దుర్మరణం
X

దిశ, వెబ్ డెస్క్: కొన్నిసార్లు ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు మంచి కంటే చెడునే ఎక్కువ చేస్తాయి. అందుకే ఎంత చిన్న నిర్ణయమైనా ఆలోచించి, ఒకటి రెండుసార్లు పరిశీలించి చేయాలని అంటారు. కానీ భార్య, భర్తల మధ్య జరిగిన గొడవలో ఇవేవీ పని చేయడం లేదు. కొందరు క్షణాకావేశానికి పోయి ప్రాణం పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి ఘటన కాకినాడ జిల్లాలో జరిగింది. అయితే ఈ ఘటన వెనుక మద్యం మత్తు, క్షణికావేశం ఉండటం బాధాకరం.

కాకినాడ జిల్లా పాయకరావుపేటలో అనిల్ కుటుంబం ఉంటుంది. అయితే అనిల్ మద్యం అలవాటు ఉంది. దీంతో భార్యతో గొడవలు జరుగుతుంటాయి. అప్పుడప్పుడు భార్య, భర్తల మధ్య ఘర్షణ జరుగుతుంటుంది. డిష్యూం.. డిష్యూం అయిపోయిన తర్వాత అన్ని మర్చిపోయి కలిసిమెలిసి ఉంటారు. కానీ ఈసారి మాత్రం ఆ కుటుంబంలో విషాదం చేటు చేసుకుంది. భర్త అనిల్, ఆయన కుమారుడు దుర్మరణం చెందారు.

అసలు జరిగిందేందంటే..?

కాకినాడ జిల్లా పాయకరావుపేటలో ఈ రోజు భర్త అనిల్ మద్యం మత్తులో తన భార్యతో గొడవ పడ్డారు. అనంతరం తన ఎనిమిదేళ్ల కొడుకును తీసుకుని గుంటూరు వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అయితే తాండవ నదిపై ఉన్న బ్రిడ్జిని దాటేందుకు యత్నించారు. ఈ సమయంలో వారిద్దరిని మృత్యువు వెంటాడింది. సడీసప్పుడు లేకుండా వచ్చిన రైలు.. తండ్రీకొడుకులను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. తండ్రీకొడుకుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.

Next Story