ఆత్మకూరులో దారుణం.. చిన్నారి చెవిని కొరుక్కుతిన్న కుక్కలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-12 13:20:37  IST  )

నంద్యాల జిల్లా ఆత్మకూరులో దారుణం జరిగింది. ...

ఆత్మకూరులో దారుణం.. చిన్నారి చెవిని కొరుక్కుతిన్న కుక్కలు
X

దివ, వెబ్ డెస్క్: నంద్యాల జిల్లా(Nandyala District) ఆత్మకూరు(Atmakur) మండలం ఇస్లాంపేటలో దారుణం జరిగింది. ఇంటి ముందు ఆగుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిపై కుక్కలు(Dogs) దాడి (Attack) చేశాయి. చిన్నారిని విచక్షణా రహితంగా కొరికాయి. దీంతో చిన్నారి కాళ్లు, చేతులు, ముఖం తల, వీపు భాగాలపై తీవ్ర గాయాలు అయ్యాయి. చిన్నారి చెవిని అయితే కుక్కలు కొరుక్కు తిన్నాయి. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఆత్మకూరులో కుక్కల స్వైరవిహారంపై అధికారులకు ఫిర్యాదు చేశామని, పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు. అధికారులు పట్టించుకుని చర్యలు తీసుకున్నట్లైతే చిన్నారికి ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్లక్షం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story