Y. S. Avinash Reddy : ఎంపీ అవినాశ్ రెడ్డి ర్యాలీ: పులివెందులలో హై టెన్షన్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-06 12:30:07  IST  )

కడప జిల్లా పులివెందులలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది...

Y. S. Avinash Reddy : ఎంపీ అవినాశ్ రెడ్డి ర్యాలీ: పులివెందులలో హై టెన్షన్
X

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా పులివెందుల(Pulivendula)లో హైటెన్షన్ నెలకొంది. జడ్పీటీసీ ఎన్నికల(Zdptc Elections) ప్రచారంలో వైసీపీ(Ycp), టీడీపీ(Tdp) నేతల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో స్వతంత్ర అభ్యర్థి సురేశ్‌తో పాటు వైసీపీ ఎమ్మెల్యే రమేశ్ యాదవ్ కారుపైనా దాడులు జరిగాయి. ఈ దాడుల్లో నాలుగు కార్లు ధ్వంసం కాగా స్వతంత్ర అభ్యర్థి సురేశ్, రమేశ్ యాదవ్‌కు గాయాలయ్యాయి. దీంతో ఈ ఘటనలను ఖండిస్తూ కడప ఎంపీ అవినాశ్ రెడ్డి(Kadapa Mp Avinash Reddy) నిరసన ర్యాలీ నిర్వహించారు. వైసీపీ కార్యాలయం నుంచి డీఎస్పీ ఆఫీసు వరకు ర్యాలీ నిర్వహించారు. టీడీపీ నేతలపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డీఎస్పీకి వినతి పత్రం అందజేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్బంగా అవినాశ్ రెడ్డి మాట్లాడుతు టీడీపీ నేతలు రాళ్లు, రాడ్లతో దాడి చేశారని మండిపడ్డారు. తామూ రాళ్లు, రాడ్లు తీసుకురావొచ్చా అని ప్రశ్నించారు. తమ మౌనాన్ని చేతగాని తనంగా తీసుకోవద్దని ఎంపీ అవినాశ్ రెడ్డి హెచ్చరించారు.

మరోవైపు పులివెందులలో హై టెన్షన్ నెలకొంది. వైసీపీ, టీడీపీ నేతల ఘర్షణ దృష్ట్యా పోలీసులు నగరంలో భారీగా మోహరించారు. జడ్పీటీసీ ఎన్నికలు ముగిసే వరకూ భద్రతను కట్టుదిట్టం చేయాలని నిర్ణయించారు.

Next Story