ఎన్టీఆర్ జిల్లాలో అకాల వర్షం బీభత్సం.. విలవిలలాడిపోతున్న అన్నదాత

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-21 10:24:43  IST  )

ఎన్టీఆర్ జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కొద్దిసేపటికే ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షం కురిసింది. దీంతో జగ్గయ్యపేట, నందిగామ పరిసర ప్రాంతాల్లో రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది...

ఎన్టీఆర్ జిల్లాలో అకాల వర్షం బీభత్సం.. విలవిలలాడిపోతున్న అన్నదాత
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్టీఆర్ జిల్లా(Ntr District)లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కొద్దిసేపటికే ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షం(Rain) కురిసింది. దీంతో జగ్గయ్యపేట(Jaggaiahpet), నందిగామ(Nandigama) పరిసర ప్రాంతాల్లో రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. కొన్ని రోజులుగా ఎండ తీవ్రతను తట్టుకుని కష్టపడి పెంచుకున్న పంటలు చేతికి వచ్చే తరుణంలో అకాల వర్షం దెబ్బకు పంట పొలాలన్నీ జలమయం అయ్యాయి.

మిర్చి, మొక్కజొన్న సాగుపై ఎఫెక్ట్

ప్రధాన మిర్చి, మొక్కజొన్న సాగుపై వర్షం విరుకుపడింది. కోతకు వచ్చిన మిర్చి కల్లాలు నీట మునిగిపోయాయి. దీంతో కంకులు తడిసి మొలకెత్తే పరిస్థితికి వచ్చాయి. అరటి, బొప్పాయి తోటలపై ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. వర్షం దాటికి పూత దశలో ఉన్న మామిడి తోటలు మొత్తం రాలిపోయాయి. దీంతో దిగుబడి భారీగా తగ్గే అవకాశం ఉందని రైతులు లబోదిబో మంటున్నారు. లక్షలాది రూపాయలు అప్పులు తెచ్చి సాగు చేస్తే ఈ విపత్తు తీరని శోకాన్ని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన ప్రతి తమనకు పరిహారం అందేలా చూడాలని అధికారులను కోరుకున్నారు.

Next Story