- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏలూరులో దారుణం.. సచివాలయం ప్రాంగణంలో యువతిపై గ్యాంగ్ రే*ప్
ఏలూరు నగరంలో సచివాలయం ప్రాంగణంలో దారుణ ఘటన జరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: ఏలూరు నగరంలో సచివాలయం ప్రాంగణంలో దారుణ ఘటన జరిగింది. ఓ యువతిపై దుండగులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. బుధవారం అర్థరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని తమ ఇంిలోకకి ఇద్దరు దుండగులు చొరబడ్డారు. ఒంటరిగా ఉన్న ఇద్దరు యువతుల్ని బెదిరించి భయపెట్టారు. వారిలో ఒక యువతిని సమీపంలోని సచివాలయం ప్రాంగణంలోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు.
జరిగిన విషయాన్ని యువతి బంధువులకు చెప్పగా. వారు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు స్థానిక పీఎస్ కు వెళ్లినా ఎవరూ పట్టించుకోలేదని వారు ఆరోపించారు. యువతి బంధువులు పట్టుబట్టడంతో కేసు నమోదు చేసినా.. విషయం బయటికి రాకుండా పోలీసులు రహస్యంగా ఉంచారు. యువతి చెప్పిన వివరాలతో నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ.. అత్యాచారం కేసును పోలీసులు ఎందుకు రహస్యంగా ఉంచారన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.






