- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో సింగపూర్ విధానాలు అమలు చేస్తాం: మంత్రి అచ్చెన్నాయుడు
ఏపీ మంత్రుల బృందం సింగపూర్ పర్యటన 5వ రోజూ కొనసాగుతోంది. సింగపూర్‌లో ఉన్న ఉత్తమ విధానాలను ఏపీలోనూ అమలు చేసే దిశగా అక్కడ అధ్యయనం చేస్తున్నారు...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మంత్రుల బృందం(AP Ministerial Team) సింగపూర్(Singapoor) పర్యటన 5వ రోజూ కొనసాగుతోంది. సింగపూర్‌లో ఉన్న ఉత్తమ విధానాలను ఏపీ(Ap)లోనూ అమలు చేసే దిశగా అక్కడ అధ్యయనం చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు రోజలు పాటు పర్యటన జరిగింది. శనివారం 5వ రోజు సంక్షోభ నిర్వహణపై అధ్యయనం చేశారు. ఇందులో భాగంగా SUSS అసిస్టెంట్ ప్రొఫెసర్ రజ్వానాను కలిశారు. సింగపూర్ 'సంక్షోభ నిర్వహణ వ్యవస్థ' (Crisis Management System) మరియు విపత్తు వేళల్లో ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేసే ‘హోల్-ఆఫ్-గవర్నమెంట్’ (Whole-of-Government) విధానంపై ఆమెతో చర్చించారు. సంక్షోభ సమయంలో త్వరితగతిన నైతిక నిర్ణయాలు తీసుకోవడం, రాబోయే ప్రమాదాలను ముందే పసిగట్టి సిద్ధంగా ఉండటం వంటి అంశాలపై అవగాహన పెంచుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ సింగపూర్‌లో ఉన్న ఉత్తమ విధానాలను ఆంధ్రప్రదేశ్‌లోనూ అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు.






