ఆటోలో ప్రయాణించి రూ.500 ఇచ్చిన పవన్ కల్యాణ్

by Vemula.Srinu Prasad |

ఏపీ ప్రభుత్వం ఈ రోజు మరో బృహత్తరమైన పథకాన్ని ప్రారంభించింది...

ఆటోలో ప్రయాణించి రూ.500 ఇచ్చిన పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం(Ap Government) ఈ రోజు మరో బృహత్తరమైన పథకాన్ని ప్రారంభించింది. ఆటో డ్రైవర్ల సేవలో(AutoDriverlaSevalo) పేరుతో ఈ పథకాన్ని రూపొందించింది. అర్హులైన ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ. 15 వేలను అందజేసింది. విజయవాడలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ నేతలు ఆటోల్లో వెళ్లారు. సీఎం చంద్రబాబు(ChandrababuNaidu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan), మంత్రి నారా లోకేశ్(Nara Lokesh), బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్(Madhav) ఆటోలో ప్రయాణం చేసి వేదిక వద్దకు చేరుకున్నారు.


డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అయితే ఉండవల్లి లోటస్ పాయింట్ నుంచి విజయవాడ సింగ్ నగర్ వరకు శ్రీ జి. రాజేష్ అనే ఆటో డ్రైవర్ కి చెందిన ఆటోలో అతని కుటుంబ సభ్యులతో కలసి ప్రయాణించారు. సింగ్ నగర్ వద్ద నిర్వహించిన బహిరంగ సభకు ఆయన హాజరయ్యారు. అయితే ఆటో దిగి వెళుతూ డ్రైవర్‌కు రూ. 500 ఇచ్చారు. దీంతో ఆటో డ్రైవర్ ఫ్యామిలీ ఉబ్బితబ్బిపోయింది.


అంతకుముందు ఆటో డ్రైవర్ కుమారుడితో కలిసి రోడ్డు దాటారు. ఆటో స్టాండ్‌లో కూర్చుకున్నారు. ఆటో రాగానే సింగ్‌నగర్‌కు బయల్దేరి వెళ్లారు. ప్రయాణంలో స్థానిక ఏరియా పేర్లను ఆటో డ్రైవర్‌ను పవన్ కల్యాణ్ అడిగి తెలుసుకున్నారు. రోడ్డుపై కనిపించిన అభిమానులు, జనసేన నేతలు, కార్యకర్తలు, ప్రజలకు అభివాదం చెబుతూ సింగ్ నగర్‌కు వెళ్లారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఆటో ప్రయాణించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలు చూసి ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడు చాలా గ్రేట్ అంటూ కామెంట్స్ పోస్టు చేస్తున్నారు.

Next Story