ఏపీలో స్పేస్ పాలసీ ప్రకటన.. అమల్లో ఐదేళ్లు ఉండేలా మార్గదర్శకాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-13 13:04:13  IST  )

ఏపీ ప్రభుత్వం మరో పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చింది...

ఏపీలో స్పేస్ పాలసీ ప్రకటన.. అమల్లో ఐదేళ్లు ఉండేలా మార్గదర్శకాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం(Ap Government) మరో పాలసీ(New Polocy)ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐదేళ్ల పాటు అమల్లో ఉండేలా మార్గదర్శకాలు రూపొందించింది. ఇప్పటికే ఎన్నో పాలసీని తీసుకొచ్చిన ప్రభుత్వం స్పేస్ పాలసీ(Space Policy)ని తాజాగా ప్రకటించింది. ఈ పాలసీ అమలు కోసం రాష్ట్ర స్పేస్ సిటీ కార్పొరేషన్‌(Space City Corporation)ను ఏర్పాటు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. స్పేస్ పాలసీ ద్వారా పెట్టుబడులు, మౌలిక వసతుల అభివృద్ధి, స్టార్టప్ నిధులను ఆకర్షించాలని దిశానిర్దేశం చేసింది. దేశీయ, అంతర్జాతీయ సంస్థలను భాగస్వామ్యులుగా చేసుకోవాలని సూచించింది. అంతరిక్ష ప్రాజెక్టుల అమలుకు స్పేస్ సిటీ కార్పొరేషన్ సాయం చేస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ స్పేస్ సిటీలను సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. భూ కేటాయింపు, దరఖాస్తుల పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Next Story