- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ.. 11 గంటలకు అసెంబ్లీలో వార్షిక బడ్జెట్
రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆమోదించేందుకు కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ కాబోతోంది..

X
దిశ, వెబ్ డెస్క్: కాసేపట్లో ఏపీ కేబినెట్(AP Cabinet) భేటీ కాబోతోంది. 2025-26కు సంబంధించిన వార్షిక బడ్జెట్(Annual budget)పై చర్చించి ఆమోదం తెలుపనున్నారు. ఈ సారి రూ. 3.20 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలు చేశారు. అసెంబ్లీ(Assembly)లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్(Finance Minister Payyavula Keshav), శాసనమండలిలో మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలసారి పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టబోతోంది. దీంతో ఈ బడ్జెట్ ఎలా ఉండబోతోందనే ఉత్కంఠ నెలకొంది. సూపర్ పథకాల(Super schemes)తో పాటు రాష్ట్ర అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విజన్ 2047 లక్ష్యంగా ఆర్థిక శాఖ ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేసినట్లు అంటున్నారు.
Next Story






