- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైభంగా సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు: రేపు కల్యాణోత్సవం
అన్నమయ్య జిల్లా నందలూరు సౌమ్యనాథ స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి...

దిశ, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లా నందలూరులోని సౌమ్యనాథ స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శుక్రవారం ఉదయం 10.00 – 12.00 గం.ల వరకు కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారని, రాత్రి 07.00 గం.లకు గజ వాహనంపై స్వామి విహరిస్తారని ఆలయ నిర్వాహకులు తెలిపారు.
నంది వాహనంపై శ్రీ సిద్ధేశ్వరస్వామివారు
తాళ్ళపాక సిద్ధేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం ఉదయం 08.00 గం.లకు పల్లకీ సేవ నిర్వహించారు. రేపు సాయంత్రం 6.00 గంటలకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. రాత్రి 07.30 గం.లకు గజ వాహనంపై భక్తులను స్వామివారు ఆశీర్వదించనున్నారు.
గరుడ వాహనంపై శ్రీ చెన్నకేశవస్వామివారు.
తాళ్ళపాక శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో ఈ రోజు ఉదయం 09.00 గం.లకు మోహినీ అవతారంలో భక్తులను దర్శనమిచ్చారు. గురువారం సాయంత్రం 6 గం.లకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఆ తరువాత రాత్రి 08.30 గంటలకు గజ వాహనంపై స్వామివారు విహరిస్తారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తులను ఆకట్టుకునేలా హరికథలు, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.






