- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ap Police: మాజీ మంత్రి కాకాణి కోసం ముమ్మరంగా గాలింపు
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి..

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Former Minister Kakani Govardhan Reddy) కోసం ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆయన మంత్రిగా పని చేసిన సమయంలో నెల్లూరు జిల్లాలో మైనింగ్‌కు సంబంధించి అక్రమాలు జరిగినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణకు ఇప్పటికే పలుసార్లు నోటీసులు జారీ చేశారు. నెల్లూరు జిల్లాలోని ఆయన నివాసంతో పాటు హైదరాబాద్‌లోని ఆయన బంధువుల ఇళ్లకు వెళ్లి మరి పోలీసులు నోటీసులు అందజేశారు.
అయినా సరే విచారణకు హాజరుకాలేదు. దీంతో గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశారు. ఎస్పీ కృష్ణకాంత్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు కాకాణిని గుర్తించేందుకు గాలిస్తున్నాయి. ఏపీ(Ap), తెలంగాణ(Telangana), కర్ణాటక(Karnataka)లో పోలీసులు గాలిస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్‌లో ఇప్పటికే పలుచోట్ల గాలించారు. హైదరాబాద్(Hyderabad)లో ఉన్న రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి ఇంట్లో తాజాగా తనిఖీలు చేపట్టారు. ఎట్టిపరిస్థితుల్లోనూ కాకాణిని పట్టుకుంటామని పోలీసులు దీమా వ్యక్తం చేశారు.






