- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళలకు గుడ్ న్యూస్.. 8వ తేదీ నుంచి ఫ్రీ కోచింగ్
ఏపీలో మహిళలకు కూటమి ప్రభుత్వం(alliance government) గుడ్ న్యూస్ తెలిపింది. ..

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మహిళల(women)కు కూటమి ప్రభుత్వం(alliance government) గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ 8 నుంచి 90 రోజులు పాటు టైలరింగ్(Tailoring)లో శిక్షణ ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం లక్షా 2 వేల 832 మంది టైలరింగ్ నేర్చుకునేందుకు ఇప్పటికే దరఖాస్తు చేశారని స్పష్టం చేసింది. ఈ మేరకు వారందరికి ఈ నెల 8 నుంచి శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొంది.
కాగా ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచి కూడా మహిళలకు పెద్ద పీట వేస్తోంది. ఇప్పటికే డ్వాక్రా రుణాల పేరుతో ఆర్థిక సాయం చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో మహిళలకు వంట గ్యాస్ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫ్రీ బస్సుపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. తల్లివందనం కింద ప్రతి విద్యార్థి తల్లి అకౌంట్లలో రూ. 15 వేలు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు అసెంబ్లీలో సమావేశాల్లో మంత్రి పయ్యావుల ప్రకటించారు. తాజాగా మహిళలకు ఉపాధి కల్పించేందుకు ఉచిత కుట్టు మిషన్ కార్యక్రమాన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తోంది. దీంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమను చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోందని చెబుతున్నారు.






