Liquor Case: మళ్లీ బిగ్ షాక్.. రిమాండ్ పొడిగింపు

by Vemula.Srinu Prasad |

లిక్కర్ కేసులో నిందితులను మళ్లీ బిగ్ షాక్ తగిలింది..

Liquor Case: మళ్లీ బిగ్ షాక్.. రిమాండ్ పొడిగింపు
X

దిశ, వెబ్ డెస్క్: లిక్కర్ కేసు(Liquor Case)లో నిందితులను మళ్లీ బిగ్ షాక్ తగిలింది. మరోసారి కూడా రిమాండ్ గడువును విజయవాడ ఏసీబీ కోర్టు పొడిగించింది. మంగళవారంతో గత రిమాండ్(Remand) ముగిసింది. దీంతో మిథున్ రెడ్డి మినహా మిగిలిన 11 మంది నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో ధర్మాసనం విచారణ చేపట్టింది. హైదరాబాద్ శివారులో సీజ్ చేసిన రూ. 11 కోట్ల వ్యవహారాన్ని కోర్టులో జడ్జికి నిందితుడు రాజ్ కేసిరెడ్డి(Raj Kesireddy) వివరించారు. ఈ నెల 11న హైకోర్టు(High Court)లో డిఫాల్ట్ బెయిల్(Default bail) పిటిషన్లపై విచారణ ఉందని ఈ సందర్భంగా లాయర్ తెలిపారు. దీంతో నిందితులకు ఈ నెల 12 వరకు రిమాండ్ విధిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు నిందితులను ఆయా జైళ్లకు తరలించారు.

Next Story