అమరావతిలో SIPB సమావేశం.. రూ. 1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం

by Vemula.Srinu Prasad |

అమరావతిలో 11వ SIPB సమావేశం జరిగింది...

అమరావతిలో SIPB సమావేశం.. రూ. 1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతిలో 11వ SIPB సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించి ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్, మంత్రులు, పలువురు ఎస్ఐపీబీ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రూ. 1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఐటీ, ఇంధనం, టూరిజం, ఎరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో 30కిపైగా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాదు వీటి ద్వారా 67 వేల ఉద్యోగాలు వస్తాయని అంచనా వేశారు. ఇక దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి 11వ SIPB ఆమోదం తెలిపింది. రూ.87,520 కోట్లు పెట్టుబడి పెట్టనున్న RAIDEN INFO TECH DATA CENTERకు ఆమోదం తెలిపారు.

అయితే గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో FDI రాలేదని అటు ప్రభుత్వ వర్గాలు సైతం అంటున్నాయి. అలాగే RAIDEN INFO TECH DATA CENTER ఏర్పాటు కొత్త చరిత్రను SIPB సమావేశం లిఖిస్తుంది. అతిపెద్ద ఫారిన్ ఇన్వెస్టిమెంట్ సాధించడంపై ఐటీ మంత్రి నారా లోకేష్‌కు ముఖ్యమంత్రి, మంత్రుల అభినందనలు తెలిపారు. 15 నెలల కాలంలో పెట్టుబడుల ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని అటు ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం తెలిపారు. 3 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన SIPB సమావేశంలో ప్రాజెక్టుల వారీగా లోతైన చర్చ జరగింది. భారీ ప్రాజెక్టులకు ప్రత్యేక అధికారుల నియామకానికి నిర్ణయం తీసుకున్నారు. కంపెనీలు త్వరగా గ్రౌండ్ అయ్యేలా ప్రత్యేక అధికారులు బాధ్యత తీసుకోనున్నారు. .ఇప్పటి వరకు జరిగిన 11 SIPBల ద్వారా రూ. 7.07 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. 6.20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నారు.

Next Story