- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ విగ్రహం ముమ్మాటికీ విష్ణుమూర్తిదే.. భూమన సెన్సేషనల్ కామెంట్స్
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)పై అసత్యాలు ప్రచారం చేసిన నేపథ్యంలో వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy)పై తాజాగా పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)పై అసత్యాలు ప్రచారం చేసిన నేపథ్యంలో వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy)పై తాజాగా పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అలిపిరి సమీపంలోని ఓ విగ్రహాన్ని ఉద్దేశించి దేవుడి విగ్రహానికి అపచారం జరిగిందంటూ అసత్య ప్రచారం చేశారని.. భూమన తన వ్యాఖ్యలతో శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని డిప్యూటీ ఈవో గోవిందరాజు (Govinda Raju) ఫిర్యాదు మేరకు అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ క్రమంలోనే తనపై కేసు నమోదైన విషయంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. విగ్రహం విషయంలో తీను వివాదం చేయలేదని.. తప్పు చేశారని చెప్పానని అన్నారు. టీటీడీ పాలకవర్గం నిర్లక్ష్య వైఖరితో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని కామెంట్ చేశారు. అలిపిరి (Alipiri)లో పడి ఉన్న విగ్రహం ముమ్మాటికీ విష్ణుమూర్తిదేనని అన్నారు. విష్ణుమూర్తికి మాత్రమే శంఖు, చక్రాలు ఉంటాయని పేర్కొన్నారు. శని భగవానుడిని టీటీడీ దెయ్యంలా చూస్తోందని సెటైర్లు వేశారు. విగ్రహాన్ని నిర్లక్ష్యంగా పడేశారని ప్రశ్నిస్తే.. కేసులు పెడతారా..? అని ప్రశ్నించారు. టీటీడీ పాలకమండలి తప్పు చేస్తున్నంత కాలం తాన ప్రశ్నిస్తూనే ఉంటానని అన్నారు. శ్రీవారి ప్రతిష్టను కాపాడటానికి ఎందాకైనా పోరాటం చేస్తానని భూమన స్పష్టం చేశారు.






