Tirumala:‘ఆ పైవాడే నన్ను నడిపిస్తున్నాడు’.. తిరుమల మెట్ల మార్గం పై ఆమె మాటలకు అంతా షాక్(వైరల్ వీడియో)

by Jakkula.Mamatha |

తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు(Devotees) భారీగా తరలి వస్తారు.

Tirumala:‘ఆ పైవాడే నన్ను నడిపిస్తున్నాడు’.. తిరుమల మెట్ల మార్గం పై ఆమె మాటలకు అంతా షాక్(వైరల్ వీడియో)
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు(Devotees) భారీగా తరలి వస్తారు. ఈ క్రమంలో శ్రీవారిని దర్శించుకొని భక్తి శ్రద్దలతో మొక్కులు చెల్లించుకుంటారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించిపోతాయి అని భక్తులు విశ్వసిస్తారు. ఈ తరుణంలో తిరుమల మెట్ల మార్గం ద్వారా కాలినడకన వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే కొందరు తిరుమల కొండపైకి మెట్ల మార్గం గుండా కాలినడకన వెళ్లడానికి ఇబ్బంది పడుతుంటారు. ఈ క్రమంలో అలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్న కొంతమంది యువకులను ఓ 72 ఏళ్ల వృద్ధురాలు ఆశ్చర్యపరిచింది.

ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని భక్తిశ్రద్ధలతో 72 ఏళ్ల వృద్ధురాలు మెట్ల మార్గంలో కాలినడకన వేగంగా నడుచుకుంటూ వెళ్లడం ఎంతో మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే అక్కడే ఉన్న కొందరు యువకులు మెట్లను ఎక్కడంలో ఇబ్బంది పడుతుంటే.. ఆ బామ్మ మాత్రం చేతిలో కర్ర పట్టుకుని ఆగకుండా శ్రీ వేంకటేశ్వర స్వామివారిని తలచుకుంటూ ముందుకు వెళ్లసాగింది. ఈ బామ్మకి ఏడాది క్రితం కాలు ఫ్రాక్చర్ అయింది. అయిన కూడా శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలనే కోరిక, సంకల్పంతో నడిచింది.

ఈ క్రమంలో అక్కడ ఉన్నవారు అన్ని మెట్లు ఎలా ఎక్కుతావ్ పెద్దమ్మ అని ప్రశ్నించగా.. “ఆ పైవాడే నన్ను నడిపిస్తున్నాడు” అని ఆ బామ్మ చెప్పింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(Social Video)లో వైరల్‌గా మారింది. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు నమ్మకం, ఆత్మవిశ్వాసమే ఆమెను నడిపించిందని ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలో ఇలాంటి వారికి ప్రత్యేక దర్శనం కల్పిస్తే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Next Story