- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిజమైన దేశ నిర్మాణం అంటే అదే : మాజీ సీఎం వైయస్ జగన్
నేడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతిని (B.R.Ambedkar Death Anniversary) పురస్కరించుకొని ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : నేడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతిని (B.R.Ambedkar Death Anniversary) పురస్కరించుకొని ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైయస్ జగన్ (YS Jagan) కూడా తన ఎక్స్ వేదికగా బాబా సాహెబ్ అంబేద్కర్ ను స్మరించుకున్నారు. రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన నివాళులు అర్పిస్తున్నట్లు వైయస్ జగన్ తన పోస్టులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాలనాపరమైన అంశంపై కీలక వ్యాఖ్యను చేశారు. అసలు దేశ నిర్మాణం అంటే ఏమిటనే విషయాన్ని నిర్వచించే ప్రయత్నం చేశారు. అలా చేయడమే నిజమైన దేశ నిర్మాణంగా అభివర్ణించారు. అవి ఆచరణ సాధ్యమైనప్పుడే రాజ్యాంగ స్ఫూర్తికి నిజమైన గౌరవం దక్కుతుందని అభిప్రాయపడ్డారు.
తన ఎక్స్ ఖాతాలో వైయస్ జగన్ పోస్ట్ చేస్తూ దేశంలోని ప్రజలందరికీ సమాన అవకాశాలు లభించాలని అన్నారు. ప్రజల హక్కులకు రక్షణ లభించాలని పేర్కొన్నారు. పరస్పర గౌరవంతో కుల, మత, వర్గ, ప్రాంత, భాషా బేధాలను మరచి ప్రజలు ఏకాత్మ భావంతో జీవించాలని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆకాంక్షించారన్నారు. పై అంశాలపై బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రపంచానికి తన ఉపన్యాసాలు, రచనల ద్వారా అద్భుతమైన సందేశాన్ని ఇచ్చినట్లు వైయస్ జగన్ అన్నారు. భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అణగారిన వర్గాల ఆశలను రాజ్యాంగంగా మలచిన దార్శనికుడని కొనియాడారు.






