- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ ఘనత సీఎంకే దక్కుతుంది.. స్పష్టం చేసిన ఎమ్మెల్యే
గత ప్రభుత్వ వైఫల్యాలు కూటమి ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : టీడీపీ (TDP) హయాంలోనే ఇరిగేషన్ ప్రాజెక్టుల (Irrigation Projects) నిర్మాణం, జలాశయాల అభివృద్ధి, నదుల అనుసంధానం వంటి భారీ పనులు జరిగాయని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆ ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే (CM Chandra Babu Naidu) దక్కుతుందని స్పష్టం చేశారు. సోమశిల (Somasila) ప్రాజెక్టును టీడీపీ నేతలతో కలిసి ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ నేతలకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై మాట్లాడే హక్కు లేదన్నారు. మాజీ సీఎం వైయస్ జగన్ అవగాహన లోపం వల్లనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగిపోయాయని విమర్శించారు. సరైన అనుమతులు పొందకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం, గ్రీన్ ట్రిబ్యునల్ పనులను నిలిపివేశాయన్నారు. ఆ వైఫల్యం పూర్తిగా వైసీపీ ప్రభుత్వానిదేనని కుండ బద్ధలుగొట్టారు. అసలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడే హక్కు వైసీపీ నేతలకు లేదన్నారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసిన జగన్ రాయలసీమతో పాటు రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని అన్నారు. సొంత జిల్లా కడపకు నీటిని అందించలేని నాయకత్వం జగన్ ది అని ఎద్దేవా చేశారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి సోమశిల సందర్శన పేరుతో కొత్త డ్రామాకు తెరలేపారన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆయన అవగాహన లోపం వల్ల, నీటి నిర్వహణ తెలియక 40 టీఎంసీల జలాలు వృధాగా పోయాయని ఆరోపించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ నేతలు ఇప్పుడు ప్రాజెక్టుల సందర్శన పేరిట డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. సోమశిల, కండలేరు (Kandaleru) జలాశయాలు నీటితో నిండుకుండల్లా ఉన్నాయని వెల్లడించారు.






