- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Thandel Piracy : తండేల్ సినిమా పైరసీ ఎఫెక్ట్..ఏపీఎస్ఆర్టీసీ నుంచి బస్సు తొలగింపు
తండేల్ సినిమా పైరసీ(Thandel Movie Piracy) ప్రింట్ ను టెలికాస్ట్(Telecast)చేసిన బస్సు(BUS)ను సంస్థ సర్వీసు నుంచి తొలగించినట్లు(Removed From Service)గా ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ(APSRTC Chairman Konakalla Narayana)వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్ : తండేల్ సినిమా పైరసీ(Thandel Movie Piracy) ప్రింట్ ను టెలికాస్ట్(Telecast)చేసిన బస్సు(BUS)ను సంస్థ సర్వీసు నుంచి తొలగించినట్లు(Removed From Service)గా ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ(APSRTC Chairman Konakalla Narayana)వెల్లడించారు. పైరసీని ఆర్టీసీ సంస్థ ప్రోత్సహించదని..ఈ వ్యవహారంపై మరింత విచారణ జరుగుతోందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామమని ప్రకటించారు. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో బన్నీ వాసు నిర్మించిన 'తండేల్' సినిమా ఇటీవల విడుదలైంది. సినిమాకు హిట్ టాక్ దక్కించుకుంది.
మొదటి నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.73 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. లాంగ్ రన్‌లో వంద కోట్ల మార్కును సులభంగా దాటుతుందని బాక్సాఫీస్ వర్గాలు ధీమాగా ఉన్నాయి. అయితే 'తండేల్' పైరసీని అడ్డుకునేందుకు నిర్మాతలు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఏకంగా ఆర్టీసీ బస్సుల్లోనే సినిమాను ప్రదర్శించడం కలకలం రేపింది. సినిమా విడుదలైన నాల్గవ రోజే సినిమాను ఏపీఎస్‌ఆర్టీసీ బస్‌లో ప్రదర్శించారు. దీనిపై నిర్మాత బన్నీ వాసు తీవ్రంగా స్పందించి ఆర్టీసీ చైర్మన్ నారాయణరావుకి ఫిర్యాదు చేశారు. వందలాది మంది కష్టంను ఇలా అగౌరవ పరచడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అయినా మరోసారి ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో తండేల్ సినిమాను ప్రదర్శించారు. దాంతో మరోసారి ఆర్టీసీ చైర్మన్‌కి బన్నీ వాసు ఫిర్యాదు చేశారు. రెండోసారి బస్సులో ఈ సినిమా ప్లే అవ్వడంపై బన్ని వాసు ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఈసారి ట్వీట్‌లో బస్ టికెట్‌తోపాటూ.. బస్సులోని టీవీలో తండేల్ సినిమా ప్లే అవుతున్న వీడియో క్లిప్ కూడా పోస్ట్ చేశారు. ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలంటూ ప్రశ్నించారు. దీంతో స్పందించిన చైర్మన్ నారాయణ తండేల్ పైరసీ ప్రింట్ ను ప్రసారం చేసిన ఆ బస్సును సర్వీస్ నుంచి తొలగించినట్లుగా ప్రకటించారు. ఇటీవల గేమ్ చేంజర్, పుష్పా 2, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను కూడా పైరసీ చేయడం వివాదస్పదమైంది.






