సనాతన ధర్మ పక్షాన నిలిచిన నాయకుడు థాక్రే : డిప్యూటీ సీఎం

by Thanuru Gopichand |

నేడు శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాక్రే జయంతి.

సనాతన ధర్మ పక్షాన నిలిచిన నాయకుడు థాక్రే : డిప్యూటీ సీఎం
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో ధర్మంపై (Dharma) దాడులు జరిగినప్పుడు.. ధర్మ వ్యతిరేక కార్యకలాపాలు జరిగినప్పుడు ధర్మం పక్షాన నిలిచిన నాయకుడు బాలాసాహెబ్ థాక్రే (Balasaheb Thackray) అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. బాలా సాహెబ్ థాక్రే వందో జయంతిని పురస్కరించుకొని ఆయనకు ఘన నివాళిని అర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాల్ థాక్రేను తలచుకుంటూ.. మరాఠాల ఆత్మగౌరవం కోసం, వారి ఉనికిని కాపాడటం కోసం శివసేనను (Siva Sena) స్థాపించారన్నారు. సొంత కాళ్ళపై మరాఠాలు నిలబడేలా వారికి అండగా నిలిచారన్నారు. అంతేకాకుండా ఉగ్రమూకల నుంచి హిందువులను రక్షించేందుకు సింహంలా గర్జించారన్నారు. తన జీవితాన్ని నమ్ముకున్న ప్రజలకు అంకితం చేసిన మహనీయుడు బాలా సాహెబ్ థాక్రే అని కొనియాడారు.

కేవలం నాయకుడిగానే కాకుండా రచయితగా, కార్టూనిస్టుగా, జర్నలిస్టుగా ప్రజలను తన ఆలోచన ద్వారా చైతన్యపరిచారని డిప్యూటీ సీఎం తెలిపారు. ఆత్మగౌరవాన్ని కాపాడుకునేలా, ప్రజల్లో ధైర్యాన్ని పెంచేలా, సంస్కృతి పరిరక్షణ వైపు ప్రజలను నడిపించేలా ఆయన ఉద్యమాన్ని రేకెత్తించారన్నారు. బెదురులేని గళం, రాజీలేని సిద్ధాంతం, దేశం పట్ల ఎనలేని భక్తిభావం ప్రతి తరానికి స్ఫూర్తిగా నిలిచిపోతోందని డిప్యూటీ సీఎం తెలిపారు.

Next Story