- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP DGP : ఉగ్రదాడి నేపథ్యం...ఏపీ డీజీపీ సంచలన ప్రకటన
పహల్గామ్ ఉగ్రదాడి(Pahalagam Terror Attack) నేపథ్యంలో పాకిస్తాన్ పట్ల భారత్ పలు కఠిన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : పహల్గామ్ ఉగ్రదాడి(Pahalagam Terror Attack) నేపథ్యంలో పాకిస్తాన్ పట్ల భారత్ పలు కఠిన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. పాక్ పౌరుల, పర్యటకుల వీసాలను రద్దు చేసింది. తక్షణమే భారత్‌ను విడిచి వెళ్లాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amith Sha) స్వయంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్లు చేసి.. పాకిస్థానీయులను పంపేయాలని ఆదేశాలు ఇచ్చారు. కేంద్రం ఆదేశాలతో అన్నిరాష్ట్రాల పోలీసులు.. అణువణువు జల్లెడ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ(AP DGP) సంచలన ఆదేశాలు జారీ చేశారు.
ఏపీలో ఉన్న పాకిస్తానీయులు తక్షణమే దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. ఈ నెల 27 తర్వాత ఏపీలో పాక్ దేశీయులు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏపీలో ఉన్న పాకిస్తానీయులను గుర్తించి తక్షణమే రాష్ట్రం నుంచి పంపించాలని అన్ని పోలీస్ స్టేషన్లకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా(DGP Harish Kumar Gupta) ఉత్తర్వులు జారీ చేశారు. కాగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పాకిస్థానీలు వెంటనే వెళ్లిపోవాలని లేని పక్షంలో చర్యలు ఉంటాయని తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డి హెచ్చరించారు. పాకిస్తాన్ కు చెందిన వారి వీసాలు ఏప్రిల్ 27వ తేది నుంచి రద్దు చేయబడతాయిని తెలిపారు. వైద్య వీసాలు మాత్రమే ఏప్రిల్ 29వతేది వరకు చెల్లుబాటు అవుతాయని పేర్కోన్నారు.






