గురుకుల విద్యార్థిని ఆత్మహత్య.. ఉద్రిక్తత

by Vemula.Srinu Prasad |

ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం అంబేద్కర్ గురుకుల పాఠశాల టెన్త్ విద్యార్థిని కావ్య ఆత్మహత్య చేసుకున్నారు..

గురుకుల విద్యార్థిని ఆత్మహత్య.. ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం అంబేద్కర్ గురుకుల పాఠశాల టెన్త్ విద్యార్థిని కావ్య ఆత్మహత్య చేసుకున్నారు. హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. అయితే ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థిని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. కావ్య ఆత్మహత్యపై తమకు అనుమానాలున్నాయని తెలిపారు. స్కూలు సిబ్బంది వేధింపులతో తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో కావ్య బంధువులతో పోలీసులు, తహశీల్దార్ మాట్లాడారు. కావ్య ఆత్మహత్యపై విచారణ జరిపిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Next Story