‘పెద్ది’ సినిమా ప్రీ- రిలీజ్ ఈవెంట్‌కు పోటెత్తిన ఫ్యాన్స్.. ఉద్రిక్తత

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-01 13:40:33  IST  )

విజయవాడలో జరిగిన ‘పెద్ది’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలతో పాటు తిరుపతి, నెల్లూరు వంటి దూరప్రాంతాల నుండి అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు...

‘పెద్ది’ సినిమా ప్రీ- రిలీజ్ ఈవెంట్‌కు పోటెత్తిన ఫ్యాన్స్.. ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడలో జరిగిన ‘పెద్ది’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్(‘Peddhi’ movie pre-release event) వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలతో పాటు తిరుపతి, నెల్లూరు వంటి దూరప్రాంతాల నుండి అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే, సాయంత్రం 5:30 గంటలకే పోలీసులు స్టేడియం గేట్లు మూసివేయడంతో గందరగోళం నెలకొంది. లోపల స్టేడియం పూర్తిగా నిండిపోయిందనే కారణంతో పోలీసులు ఎవరినీ లోపలికి అనుమతించలేదు.

సెలబ్రిటీ పాస్‌లు, సాధారణ పాస్‌లు ఉన్నప్పటికీ తమను లోపలికి పంపించకపోవడంపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాస్‌లు చేతిలో ఉన్నప్పుడు ఎందుకు అనుమతించడం లేదంటూ పోలీసులతో ఫ్యాన్స్ వాగ్వాదానికి దిగారు. గేట్ల వద్ద భారీగా ఫ్యాన్స్ పోటెత్తడంతో పరిస్థితి అదుపు తప్పి, ఈవెంట్ ప్రాంగణం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Next Story