- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజయ్యపేటలో మరోసారి ఉద్రిక్తత
విశాఖ జిల్లా నక్కపల్లి నియోజకవర్గం రాజయ్యపేటలో మరోసారి ఉద్రిక్తత కొనసాగింది..

దిశ, వెబ్ డెస్క్: విశాఖ జిల్లా(Visakha District) నక్కపల్లి నియోజకవర్గం(Nakkapalle Constituency) రాజయ్యపేట(Rajaiahpet)లో మరోసారి ఉద్రిక్తత కొనసాగింది. బల్క్ డ్రగ్ పార్క్(Bulk Drug Park)కు వ్యతిరేకంగా మత్య్సకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 8 నుంచి నిరసన దీక్ష కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మత్య్సకారులతో మాట్లాడేందుకు వెళ్లిన హోంమంత్రి అనితకు కూడా నిరసన సెగ తగిలింది.
అయితే మత్య్సకారుల ఆందోళనకు పలువురు రాజకీయ నాయకులు సైతం మద్దతు పలికారు. ఆందోళనకారును పరామర్శించేందుకు ఈ రోజు వెళ్లిన రాజకీయ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మత్య్సకారులు ఆందోళనకు దిగారు. తమకు మద్దతు తెలిపేందుకు వచ్చే రాజకీయ నేతలను అడ్డుకోవడం సరికాదన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. నక్కపల్లి నేషనల్ హైవేపై నిరసనకు దిగారు. బల్క్ డ్రగ్ పార్క్ తమకు వద్దని నినాదాలు చేశారు.






