తెలుగు భక్తులపై దాడి.. శబరిమలలో ఉద్రిక్తత

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-05 10:39:32  IST  )

శబరిమలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది...

తెలుగు భక్తులపై దాడి.. శబరిమలలో ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: శబరిమల(Sabarimala)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలుగు రాష్ట్రాల(Telugu States) నుంచి వెళ్లిన కొందరు భక్తుల(Devotees)పై స్థానిక వ్యాపారులు దాడులకు దిగారు. వాటర్ బాటిల్ ధర విషయంలో ప్రశ్నించినందుకు ఓ షాపు యజమాని దౌర్జన్యానికి పాల్పడ్డారు. గాజు సీసాలతో దాడి చేశారు. ఈ దాడుల్లో ఓ భక్తుడి తలకు గాయమైంది. దీంతో తెలుగు రాష్ట్రాల భక్తులందరూ షాపు వద్ద ఆందోళన చేపట్టారు. అయితే ఆ షాపు యజమానికే స్థానిక వ్యాపారులు, పోలీసులు వత్తాసు పలికినట్లు తెలుస్తోంది.

దీంతో తెలుగు భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయ్యప్ప మాల ధరించి నిష్టగా పూజలు చేసి స్వామిని దర్శించుకునేందుకు శబరిమల వచ్చిన భక్తులను స్థానిక వ్యాపారులు దోచుకుంటున్నారని, ప్రతి వస్తువుకూడా అధికార ధరలు అమ్ముతున్నారని తెలుగు భక్తులు తెలిపారు. ఎమ్మార్పీపై ప్రశ్నిస్తే దాడులకు సైతం దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో దూరం వచ్చిన తమ పట్ల వివక్ష చూపడం తగదని వాపోయారు.

Next Story