మచిలీపట్నంలో వంగవీటి రంగా వర్థంతి.. ఉద్రిక్తత

by Vemula.Srinu Prasad |

మచిలీపట్నంలో వంగవీటి రంగా వర్థంతి నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది...

మచిలీపట్నంలో వంగవీటి రంగా వర్థంతి.. ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక నాయుడుపేటలో వంగవీటి రంగా వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే కూటమి నాయకులకు పోటీగా వైసీపీ శ్రేణులు సైతం రంగా వర్థంతిని జరుపుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. నగరంలో ర్యాలీ నిర్వహించాలని డిసైడ్ అయ్యాయి. అంతేకాదు వైసీపీ నాయకులు, పేర్ని నాని అనుచరులు ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చారు. అయితే శాంతి భద్రతల దృష్ట్యా కూటమి నాయకుల ర్యాలీ అయిన తర్వాత వైసీపీ శ్రేణులకు అనుమతిస్తామని పోలీసులు తెలిపారు. దీంతో పేర్ని నాని అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ ప్రోగ్రాం చెడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమ ర్యాలీపై ఆంక్షలు పెట్టడం సరికాదని మండిపడ్డారు. కూటమి నేతలు వెళ్లే దారిలో కాకుండా తాము వేరుగా రంగా వర్థంతిని నిర్వహిస్తామని పేర్నినాని చెప్పారు. కానీ శాంతి భద్రతల దృష్ట్యా కూటమి నాయకుల ర్యాలీ అయిన తర్వాతే అనుమతిస్తామని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు తీరును పేర్ని నాని తప్పుబట్టారు.

Next Story