Ap: నవోదయ స్కూలులో విద్యార్థిని ఆత్మహత్య.. ఉద్రిక్తత

by Vemula.Srinu Prasad |

నవోదయ స్కూలులో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంపై ఉద్రిక్తత కొనసాగింది...

Ap: నవోదయ స్కూలులో  విద్యార్థిని ఆత్మహత్య.. ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కృష్ణాపురం నవోదయ స్కూలులో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నారు. రాత్రి స్కూలు మెట్ల మార్గం వద్ద గ్రిల్స్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే విద్యార్థిని స్కూలులో ఆత్మహత్య చేసుకోవడంపై అనుమానాలు తలెత్తాయి. స్కూలు వద్ద విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. తమ బాలిక ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తం చేశారు. తమ కూతురుని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని విద్యార్థిని తండ్రి ఆరోపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనలో స్కూలు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. విద్యార్థిని తల్లిదండ్రులతో చర్చించారు. న్యాయం చేస్తామని చెప్పారు. అయినా సరే విద్యార్థిని తల్లిదండ్రులు ఆందోళనను విరమించలేదు. తమ కూతురు మృతికి కారణమైన వారిని గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story