- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నంద్యాల జిల్లా పలుకూరు క్రాస్ రోడ్డు వద్ద ఉద్రిక్తత
by Ajay Maddhiboyina |
నంద్యాల జిల్లా పలుకూరు క్రాస్ రోడ్డు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. నూతన రాయాల్టీ విధానాన్ని నిరసిస్తూ కార్మికులు రోడ్డుపైకి వచ్చారు. ఈ క్రమంలో రాయల్టీ సిబ్బందితో కార్మికులకు వాగ్వాదం చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్: నంద్యాల జిల్లా పలుకూరు క్రాస్ రోడ్డు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. నూతన రాయాల్టీ విధానాన్ని నిరసిస్తూ కార్మికులు రోడ్డుపైకి వచ్చారు. ఈ క్రమంలో రాయల్టీ సిబ్బందితో కార్మికులకు వాగ్వాదం చోటు చేసుకుంది. సిబ్బంది ఏర్పాటు చేసుకున్న చెక్ పోస్ట్ షెడ్డును కార్మికులు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్రిక్తత నేపథ్యంలో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఇదిలా ఉంటే నూతన రాయాల్టీ విధానంలో మైనింగ్ రాయాల్టీలను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని నిర్ణయించారు. దీంతో నాపరాతి యజమానులు, తమకు ఉపాధి లభించదని కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
Next Story






