- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖ సమతా కాలేజ్ వద్ద ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
by Vemula.Srinu Prasad |
విద్యార్థి ఆత్మహత్యతో విశాఖ సమతా కాలేజ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది..

X
దిశ, వెబ్ డెస్క్: మహిళా లెక్చరర్ లైంగిక వేధింపుల కారణంతో విశాఖ సమతా కాలేజీ(Visakhapatnam Samatha College)లో డిగ్రీ ఫైనలియర్ విద్యార్థి సాయితేజ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు కాలేజీ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. కళాశాల గేటు పగలగొట్టేందుకు విద్యార్థులు ప్రయత్నం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు సైతం ఆందోళన వ్యక్తం చేశారు. సాయితేజకు న్యాయం జరిగే వరకు కళాశాల వద్ద నుంచి కదిలేదన్నారు. జిల్లా కలెక్టర్ వచ్చి న్యాయం చేసేవరకు నిరసన విరమించమమని అటు విద్యార్థులు హెచ్చరించారు. సాయితేజ కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ మేరకు పోలీసులు కాలేజీ వద్ద భారీగా మోహరించారు.
Next Story






