నంద్యాలలో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం.. ఉద్రిక్తత

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-31 09:04:35  IST  )

నంద్యాల పట్టణంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక శ్రీనివాస సెంటర్‌లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని జంబులయ్య అనే వ్యక్తి ధ్వంసం చేశారు. ...

నంద్యాలలో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం.. ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: నంద్యాల(Nandyala)లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక శ్రీనివాస సెంటర్‌లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి(YS Rajasekhara Reddy) విగ్రహాన్ని జంబులయ్య అనే వ్యక్తి ధ్వంసం చేశారు. విగ్రహం తల భాగాన్ని పూర్తిగా తొలగించారు. దీంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.

వైసీపీ శ్రేణుల తీవ్ర ఆగ్రహం

అయితే ఈ ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party) శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పెద్ద ఎత్తున శ్రీనివాస సెంటర్‌కు చేరుకుని నిరసనలు చేపట్టారు. వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. ఇటువంటి ఘాతుకాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.

విగ్రహం ధ్వంసంపై విచారణ

మరోవైపు ఘటనా స్థలాన్ని పోలీసులు సైతం పరిస్థితిని సమీక్షించారు. విగ్రహం ధ్వంసానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.. ఈ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు.విగ్రహంపై దాడికి పాల్పడిన జంబులయ్యను పోలీసులు తక్షణమే అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మద్యం మత్తులోనే ఈ దాడికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు

Next Story