అనంతపురంలో ఉద్రిక్తత... ఆందోళనకారులను లాక్కెళ్లిన పోలీసులు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-13 08:50:34  IST  )

అనంతపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఎన్నో ఏళ్లుగా షాపులు నిర్వహిస్తున్నారు. అయితే అవి ఆక్రమణలంటూ, స్వచ్చంధంగా తొలంగించాలని ముందుగానే స్థానిక అధికారులు సూచించారు..

అనంతపురంలో ఉద్రిక్తత... ఆందోళనకారులను లాక్కెళ్లిన పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం(Anantapur)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి(Government Hospital) వద్ద ఎన్నో ఏళ్లుగా షాపులు నిర్వహిస్తున్నారు. అయితే అవి ఆక్రమణలంటూ, స్వచ్చంధంగా తొలంగించాలని మున్సిపల్ అధికారులు ముందుగానే సూచించారు. అయితే నిర్వహకులు మాత్రం ముందుకు రాకపోవడంతో అధికారులు తొలగింపు ప్రక్రియ చేపట్టారు. జేసీబీలతో షాపులను తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో అధికారులను షాపుల నిర్వహకులు అడ్డుకున్నారు. అధికారులు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఆందోళనకారులను పక్కకు లాగేసిన పోలీసులు

అయితే ఆందోళనకారులపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనా స్థలం నుంచి పక్కకు లాగిపడేశారు. ఆక్రమణలను పూర్తి తొలగించారు. అయితే షాపు నిర్వహకులు మాత్రం ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా తాము షాపులు నిర్వహిస్తున్నామని, ఇప్పుడు వాటిని తొలగిస్తే తమకు జీవనాధారం ఏది అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Next Story