- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు.. ఉద్రిక్తత
తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది...

దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లా(East Godavari District) రాజానగరం(Rajanagaram)లో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా(Former Mla Jakkampudi Raja) ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాపునేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu)పై ఇంటి వద్ద జరిగిన అరాచాకంపై ఆయన మండిపడ్డారు. కాపు సామాజిక వర్గంపై పగబట్టారని ఆరోపించారు. అంబటికి సంఘీభావంగా జక్కంపూడి విజయలక్ష్మి , మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా, వైయస్ఆర్ సీపీ యువజన నాయకులు గుంటూరుకు బయలుదేరారు. దీంతో వారిని జక్కంపూడి నివాసం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. అందర్నీ హౌస్ అరెస్ట్ చేశారు. జక్కంపూడి ఇంటి వద్ద పోలీసులు భారీగా మొహరించారు. దీంతో పోలీసులపై జక్కంపూడి రాజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని జక్కంపూడి వార్నింగ్ ఇచ్చారు.






