కోమటి చెరువు దగ్గర ఉద్రిక్తత.. పోలీసులను అడ్డుకున్న నారాయణరావు ఫ్యామిలీ

by Malleboina Mahesh |   (  Updated:2025-10-23 05:26:21  IST  )

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారిన అత్యాచార ప్రయత్నం ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నింధితుడు నారాయణ రావు తుని కోమటి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

కోమటి చెరువు దగ్గర ఉద్రిక్తత.. పోలీసులను అడ్డుకున్న నారాయణరావు ఫ్యామిలీ
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారిన అత్యాచార ప్రయత్నం ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నింధితుడు నారాయణ రావు తుని కోమటి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచేందుకు తీసుకెళ్తున్న సమయంలో.. వాష్ రూమ్ కి వెళ్తానని నారాయణరావు అడగడంతో.. పోలీసులు కోమటి చెరువు వద్ద వాహనాన్ని ఆపారు. ఆ సమయంలో పోలీసుల నుంచి పారిపోయేందుకు నింధితుడు నారాయణరావు చెరువులో దూకి గల్లంతయ్యాడు. అనంతరం పోలీసులు అతన్ని వెతికేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దాదాపు రెండు గంటల తర్వాత గజ ఈతగాళ్ల సహాయంతో కోమటి చెరువులో నారయణరావు మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు.

ఈ సమాచారం అందుకున్న అతని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో తుని కోమటి చెరువు దగ్గర కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించే క్రమంలో నారాయణరావు కుటుంబ సభ్యులు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో వెంటనే అప్రమత్తం అయిన పోలీసులు ఆందోళన చేసే వాళ్ళని పక్కకు లాగి మృతదేహాన్ని తరలించారు. పోలీసుల తీరుపై నారాయణరావు కుటుంబ సభ్యుల అనుమానం వ్యక్తం చేశారు. నారాయణరావుది సూసైడ్‌ కాదంటున్న కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. నలుగురు పోలీసులు వచ్చి తమతో బలవంతంగా సంతకాలు తీసుకున్నారని, రాత్రి పదిన్నరకు చెరువులో దూకితే ఇవాళ ఉదయం 7గంటలకు సూసైడ్‌ చేసుకున్నాడని సీఐ చెప్పాడని. ఘటన జరిగిన వెంటనే తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Read More: తుని అత్యాచారం కేసులో ట్విస్ట్.. నిందితుడు నారాయణ‌రావు ఆత్మహత్య

Next Story