తునిలో టెన్షన్​.. టెన్షన్​

by Thanuru Gopichand |

తుని పురపాలక సంఘం లో ఈ రోజు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరనుంది.

తునిలో టెన్షన్​.. టెన్షన్​
X

దిశ, డైనమిక్​ బ్యూరో/ కాకినాడ జిల్లా : తుని పురపాలక సంఘం లో ఈ రోజు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరనుంది.గతంలో జరిగిన అల్లర్లు నేపథ్యంలో సెక్షన్ 144 అమలు చేస్తున్నారు. తుని మున్సిపాలిటీ పోలీసుల వలయంలో ఉంది. తుని మున్సిపాలిటీలో ప్రస్తుత 28 మంది కౌన్సిలర్లలో 18 మంది వైసీపీతో ఉన్నారు. 10 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. టీడీపీ వైస్ చైర్మన్ పదవిని దక్కించుకోవాలంటే.. మరో ఐదుగురి మద్దతు కావాల్సి ఉంది.. వైసీపీతో 18 మందిలో 5 వీరితో టచ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ ఏలూరి సుధారాణి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్​ కార్యాలయం వద్ద టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి దాడిశెట్టి రాజాతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య తోపులాట జరిగింది. ఎన్నికను అడ్డుకునేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. తుని వైస్ చైర్మన్ ఎన్నికని సజావుగా జరిగించాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ.. ప్రస్తుతం ఏం జరుగుతుందోననే ఉత్కంఠ కొనసాగుతోంది.

Next Story