రాజమండ్రిలో ఉద్రిక్తత.. పోలీసులతో మాజీ ఎంపీ భరత్ వాగ్వాదం

by Vemula.Srinu Prasad |

రాజమండ్రి కంబాల చెరువు సెంటర్‌లోని దండి మార్చ్ విగ్రహాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ స్వచ్ఛంద సంస్థ ఈ విగ్రహాలకు పెయింటింగ్ వేస్తోంది. ..

రాజమండ్రిలో ఉద్రిక్తత.. పోలీసులతో మాజీ ఎంపీ భరత్ వాగ్వాదం
X

దిశ, వెబ్ డెస్క్: రాజమండ్రి కంబాల చెరువు సెంటర్‌(Rajahmundry Kambala Lake Center)లోని దండి మార్చ్ విగ్రహాల(Dandi March statues) వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ స్వచ్ఛంద సంస్థ ఈ విగ్రహాలకు పెయింటింగ్ వేస్తోంది. అయితే ఆ పనులను పరిశీలించడానికి మాజీ ఎంపీ మార్గాని భరత్(Former MP Margani Bharat) తన అనుచరులతో కలిసి అక్కడికి వెళ్లారు. ఈ సమయంలో భరత్ బృందాన్ని పోలీసులు మార్గమధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, మున్సిపల్ అధికారులతో మాజీ ఎంపీ భరత్ తీవ్ర వాగ్వాదానికి దిగారు. స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలను చూడటానికి అనుమతి కావాలా అని ఆయన నిలదీశారు. వైసీపీ నేతలను ముందుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది.

అయితే ప్రజా ప్రతినిధులను విగ్రహాల వద్దకు వెళ్లకుండా ఆపడంపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. విగ్రహాల పరిరక్షణ పేరుతో జరుగుతున్న పనులను పరిశీలించే హక్కు తమకు ఉందని భరత్ స్పష్టం చేశారు. భారీగా పోలీసులు మోహరించడంతో కంబాల చెరువు ప్రాంతంలో సెక్షన్ 144 తరహా వాతావరణం కనిపించింది.

Next Story