అనంతపురం జిల్లాలో రాళ్ల దాడి.. ఉద్రిక్తత

by Vemula.Srinu Prasad |

అనంతపురం జిల్లా యాకిడిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది....

అనంతపురం జిల్లాలో రాళ్ల దాడి.. ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా యాకిడి(Yakidi)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysrcp), టీడీపీ(Tdp) కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం రాళ్లురువ్వుకున్నారు. ఈ దాడుల్లో వైసీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. రాష్ట్రంలో ఏర్పాటు కాబోతున్న మెడికల్ కాలేజీల(Medical Colleges)ను పీపీపీ(PPP) విధానంలో నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ నేతలు కోటి సంతకాల సేకరణ చేపట్టారు. దీన్ని టీడీపీ(Tdp) కార్యకర్తలు వ్యతిరేకించడంతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఇక విషయం తెలుసుకున్న వైసీపీ మాజీ మంత్రి కేతిరెడ్డి పెద్దారెడ్డి(Ycp Former Minister Ketireddy Peddareddy).. ఆస్పత్రిలో గాయపడిన వారిని పరామర్శించారు.

Next Story