- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో నాన్ లోకల్స్‌కు ఉద్యోగాలు.. ఉద్రిక్తత
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది....

X
దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు(Pedagarlapadu)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ(Shree Cement Factory)లో నాన్ లోకల్స్‌కు ఉద్యోగులు ఇస్తున్నారంటూ కారంపూడి మండలం ఇనపరాజుపల్లి(Inaparajupalli) రైతులు, మహిళలు ఆందోళనకు దిగారు. భూములు ఇచ్చిన తమకు అన్యాయం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను గతంలోనే ఫ్యాక్టరీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లామని, అప్పుడు హామీ ఇచ్చారని, కానీ ఇప్పటి వరకూ పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పటికైనా భూములు ఇచ్చిన తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులతో సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం మాట్లాడే ప్రయత్నం చేస్తోంది. అయితే తమకు న్యాయం చేసే వరకూ వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు.
Next Story






