ఎంపీ, మంత్రుల ఎదుటే అనితకు చేదు అనుభవం

by Vemula.Srinu Prasad |

అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది....

ఎంపీ, మంత్రుల ఎదుటే అనితకు చేదు అనుభవం
X

దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి జిల్లా(Anakapalli District) పాయకరావుపేట(Payakaraopet)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Vangalapudi Anitha)కు చేదు అనుభవం ఎదురైంది. ఎంపీ సీఎం రమేశ్, మంత్రులు అనగాని సత్యప్రసాద్(Minister Anagani Satyaprasad), కొల్లు రవీంద్ర(Kollu Ravindra)తో కలిసి మూలపేటలో ఆమె పర్యటించారు.


అయితే స్థానికులు అడ్డుకున్నారు. తమ నుంచి భూములు తీసుకొని పరిహారం చెల్లించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని, ఎవరికీ అన్యాయం జరగనివ్వకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు నిరసనను విరమించారు.

విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ

అంతకుముందు పాయకరావుపేట నియోజకవర్గంలోని విద్యార్థులకు CSR నిధులతో 10వ తరగతి విద్యార్థులకు 2,600 సైకిళ్లు పంపిణీ చేశారు. నక్కపల్లి ప్రభుత్వ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్రతో కలిసి ఎంపీ సీఎం రమేశ్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వంగలపూడి అనిత మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యకు ప్రాధాన్యం పెంచడంతో పాటు విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పన కోసం సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలని సూచించారు. మత్తుపదార్థాలు, చెడు వ్యసనాలకు లోనుకాకుండా బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని వంగలపూడి అనిత తెలిపారు.

Next Story