- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంగళగిరిలో ఉద్రిక్తత.. సాక్షి కార్యాలయం బోర్డు పీకేసిన రాజధాని రైతులు
గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది..

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా మంగళగిరి(Mangalagiri)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సాక్షి కార్యాలయం(Sakshi Office) వద్ద రాజధాని మహిళలు, రైతులు ఆందోళనకు దిగారు. అమరావతి(Amaravati) మహిళలను కించపరుస్తూ డిబేట్ చేసినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్(Jagan)కు, సాక్షి టీవీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. సాక్షి బోర్డును పీకేశారు. అనంతరం మురుగు కాలువలో పడేశారు. సాక్షి పత్రికలను తగలబెట్టారు. భారతీ రెడ్డి క్షమాపణలు చెప్పాలని మహిళా రైతులు డిమాండ్ చేశారు. సాక్షి కార్యాలయం గేటు దూకేందుకు ప్రయత్నం చేశారు.
దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. సజ్జలను, కొమ్మినేనిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. వాళ్ల ఎలా బుద్ధి చెప్పాలో తాము చెబుతామని హెచ్చరించారు. రైతులు భూములు త్యాగం చేస్తే ఏర్పడిన రాజధాని అమరావతి అని, అలాంటి ఏం తప్పుకనపడిందని ప్రశ్నించారు. సాకాత్తు ప్రధాని మోడీ వచ్చి శంకుస్థాపన చేసి దేవతల రాజధాని అని చెప్పారని గుర్తు చేశారు. ఏం తప్పు కనపడిందని, వేశ్యల రాజధాని అని అన్నారో చెప్పాలని మండిపడ్డారు.






