- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రామ సభలో ఉద్రిక్తత... భూములివ్వమంటూ రైతుల నిరసన
by Vemula.Srinu Prasad |
ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది...

X
దిశ, వెడ్ డెస్క్: ప్రకాశం జిల్లా(Prakasam District) ఉలవపాడు మండలం కరేడు(Karedu) గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇండో సోలార్ కంపెనీ(Indo Solar Company) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు భూసేకణ చేపట్టేందుకు రెవెన్యూ అధికారులు(Revenue Officer) కరేడు గ్రామానికి వెళ్లారు. అయితే అధికారులను రైతులు అడ్డుకున్నారు. ఇండో సోలార్ కంపెనీకి తాము భూములు ఇవ్వమని తేల్చిచెప్పారు. అంతేకాదు భూసేకరణ కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పంటలు పండే భూములు ఇవ్వమని.. తిరిగి వెళ్లిపోవాలని నినాదాలు చేశారు. అయితే అధికారులు, పోలీసులు రైతులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ ఒప్పుకోలేదు. దీంతో తిరిగి వెళ్లిపోయారు. ఈ సంఘటనతో స్థానికంగా కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Next Story






