కదిరిలో ఉద్రిక్తత.... కర్ణాటక వ్యక్తులపై దాడి

by Vemula.Srinu Prasad |

సత్యసాయి జిల్లా కదిరిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది....

కదిరిలో ఉద్రిక్తత.... కర్ణాటక వ్యక్తులపై  దాడి
X

దిశ, వెబ్ డెస్క్: సత్యసాయి జిల్లా కదిరి(Kadiri)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు వర్గాలకు చెందిన వ్యక్తులు ఘర్షణకు దిగారు. బస్టాండ్ సమీపంలోని సప్తగిరి హోటల్ వద్ద కారు(Car) పార్కింగ్ విషయంలో వివాదం తలెత్తింది. కర్ణాటక(Karnataka)కు చెందిన వ్యక్తులపై దాడి చేశారు. కదిరికి చెందిన వ్యక్తి తండ్రి సంవత్సరికానికి కర్ణాటక నుంచి కొందరు వ్యక్తులు పట్టణానికి వచ్చారు. అయితే సప్తగిరి హోటల్ సమీపంలో కారు పార్క్ చేశారు. దీంతో కారు తీయాలని హోటల్ సిబ్బంది దౌర్జన్యానికి పాల్పడింది. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మహిళలు వేడుకుంటున్నా వెంటపడి మరీ కర్ణాటక వ్యక్తులపై దాడి చేశారు. అడ్డుకోబోయిన కదిరికి చెందిన వ్యక్తిపైనా దాడి చేశారు. దీంతో ఇరువర్గాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారిపట్ల సప్తగిరి హోటల్ సిబ్బంది తరచూ దౌర్జన్యానికి పాల్పడుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా హోటల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు సైతం కోరుతున్నట్లు తెలుస్తోంది.

Next Story