- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: అన్నపర్రు బీసీ హాస్టల్ వద్ద ఉద్రిక్తత
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రులో ఉద్రిక్తత చోటు చేసుకుంది...

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రు(Anaparru)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థుల తల్లిదండ్రులు(Students Parents) ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. తమ పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టడంలేదని మండిపడ్డారు. హాస్టల్ వార్డెన్‌తో పాటు వంటమనిషిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో వారిని సముదాయించేందుకు హాస్టల్ సిబ్బంది ప్రయత్నం చేసింది. అయినా సరే విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనను కొనసాగిస్తున్నారు. తమ పిల్లలు అస్వస్థతకు గురికావడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని పట్టుబట్టారు.
కాగా అన్నపర్రు బీసీ హాస్టల్(Bc Hostel)లో 55 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్‌లో భోజనం చేసిన తర్వాత వాంతులు, విరేచనాలతో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారికి స్థానికి పీహెచ్సీలో వైద్యం అందిస్తున్నారు. దీంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.






