కడపలో వైఎస్ షర్మిల ఆందోళన.. ఉద్రిక్తత

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-07 11:32:11  IST  )

వైయస్సార్ కడప జిల్లా ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది..

కడపలో వైఎస్ షర్మిల ఆందోళన.. ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: వైయస్సార్ కడప జిల్లా(YSR Kadapa District) ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ(Architecture University) వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీవోఏ పర్మిషన్(COA Permission) లేకుండా జగన్ ప్రభుత్వం(Jagan Govt) కోర్సులు ప్రారంభించారని, అయితే పూర్తి అయిన తర్వాత ధ్రువ పత్రాలు ఇవ్వడంలేదని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు నిరసన దీక్షకు దిగారు. ఈ దీక్షకు పీసీసీ చీఫ్ షర్మిల(PCC Chief Sharmila) మద్దతు తెలిపారు. సీవోఏ ధ్రువపత్రం లేకుండా విద్యార్థులు ఎలా బయటకు వెళ్లాలని అంటూ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. వర్సిటీ వెంటనే సీఏవో ధ్రువ పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతంగా చేస్తామని వైఎస్ షర్మిల హెచ్చరించారు. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు ఒక్కసారి యూనివర్సిటీలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. దీంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Next Story