హోంమంత్రి అనితకు చేదు అనుభవం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-09-29 15:29:18  IST  )

హోంమంత్రి అనితకు చేదు అనుభవం ఎదురైంది...

హోంమంత్రి అనితకు చేదు అనుభవం
X

దిశ, వెబ్ డెస్క్: పాయకరావుపేట రాజయ్యపేట(Payakaraopet Rajaiahpet)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.. హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Vangalapudi Anitha)ని మత్స్యకారులు అడ్డుకున్నారు. బల్క్ డ్రగ్ పార్క్‌(Bulk Drug Park)ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హోంమంత్రి కాన్వాయ్‌ను అడ్డ‌గించారు. కాన్వాయ్ ముందు బైఠాయింపు ఆందోళన వ్యక్తం చేశారు.


బల్క్ డ్రగ్ పార్క్ సమస్యపై కమిటీ వేస్తానని హోంమంత్రి హామీ ఇచ్చారు. అయితే కమిటీకి మత్స్యకారులు అంగీకరించలేదు. దీతో పోలీసులు చెద‌ర‌గొట్టే ప్ర‌య‌త్నం చేసినా వెన‌క్కి త‌గ్గ‌కుండా ఆందోళ‌న చేప‌ట్టారు. దీంతో హోంమంత్రి వెనక్కి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

Next Story