మెగా చెక్కులో కనిపించని పవన్ ఫొటో.. టీడీపీ, జనసేన నేత‌ల ఘర్షణ

by Vemula.Srinu Prasad |

అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది....

మెగా చెక్కులో కనిపించని పవన్ ఫొటో.. టీడీపీ, జనసేన నేత‌ల ఘర్షణ
X

దిశ, వెబ్ డెస్క్: అంబేద్కర్ కోనసీమ జిల్లా(Ambedkar Konaseema District) పి.గన్నవరం(P.Gannavaram)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ(Tdp), జనసేన(Janasena) నేత‌ల మధ్య ఘర్షణ చెలరేగింది. ఆటో డ్రైవర్ల సేవలో(Auto Drivarlasevalo) కార్యక్రమాన్ని కూటమి నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ(MLA Giddi Satyanarayana) హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ నేతలు ఘర్షణకు దిగారు. రవాణా శాఖ అధికారులు ముద్రించిన క‌ర‌ప‌త్రం, మెగా చెక్కులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) ఫొటో జనసేన నాయకులు ఆందోళకు దిగారు. ఎమ్మెల్యే ఎదుటే గొడవకు దిగారు. పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలకు సర్దిచెప్పారు. అయితే పవన్ ఫొటో లేకపోవడాన్ని జనసేన నాయకులు జీర్ణించుకోలేకపోయారు. పవన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు.

Next Story